22 July, 2026 | 9:48 PM

కొండగట్టులో మొక్కులు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్

29-06-2024 02:58 PM

జగిత్యాల: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామికి శనివారం ముక్కులు చెల్లించుకున్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు పండితులు వేదాశీర్వచనాలు చేశారు. ఎన్నికలకు ముందు వారాహి వాహనంలో కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్ పూజలు చేశారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం పవన్ కళ్యాణ్ తిరుగు పయనమయ్యారు. పవన్ పర్యాటన దృష్ట్యా కొండగట్టు అంజన్న క్షేత్రంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతకు ముందు సిద్ధిపేటలో పవన్ ను గజమాలతో అభిమానులు సన్మానించారు. కారుపైకి ఎక్కి ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిమానులకు అభివాదం చేశారు.