6 August, 2026 | 12:15 AM

ప్రపంచంలో యోగా ఇప్పుడు కొత్త ట్రెండ్‌: ప్రధాని మోడీ

21-06-2024 10:53 AM

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో తన రెండు రోజుల పర్యటన సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జరిగిన యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... యోగా సాధనకు జమ్ము కశ్మీర్‌ నిలయం అన్నారు.యోగా, ధ్యానంతో మన ఏకాగ్రత పెరుగుతుందని చెప్పారు. ప్రపంచ యోగా గురువుగా భారత్‌ మారిందన్న ప్రధాని మోడీ ప్రపంచంలో యోగా ఇప్పుడు కొత్త ట్రెండ్‌ అన్నారు. పదేళ్లుగా ప్రంపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయని చెప్పారు. యోగా.. ఇవాళ కోట్ల మందికి దైనందిన కార్యక్రమమైందని పేర్కొన్నారు. యోగా ప్రాముఖ్యతను అనేక దేశాల నేతలు తనను అడిగారని ప్రధాని స్పష్టం చేశారు.