గ్రూప్ 1 అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం
08-06-2024 07:51 PM
హైదరాబాద్ : ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభకాంక్షలు తెలియజేశారు. సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని, ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా పరీక్ష రాయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్-1 పరీక్షకు హాజరువుతన్న లక్షలాది మంది అభ్యర్ధులకు శుభాకాంక్షలు అని ఉన్న ఓ పోస్టర్ ను టీజీ సీఎంఓ తన ఎక్స్ లో శనివారం పోస్ట్ చేసింది. టీజీపీఎస్ సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం నిర్వహించనున్న విషయం తెలిసిందే. కాగా రేపు ఉదయం 10 గంటలలోగా పరీక్ష కేంద్రాలకు చేరుకొవాలని సూచించింది. ఈ పరీక్ష కోసం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.






