రామోజీరావు పార్థివ దేహానికి పవన్ నివాళి
హైదరాబాద్ : రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు పార్థివ దేహానికి పూలమాల వేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. రామోజీరావు మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని, అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని రామోజీరావు నిరూపించారని పవన్ పేర్కొన్నారు.
తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చి రామోజీరావును కలవాలనుకున్నట్లు చెప్పారు. శుక్రవారం ఆయన అస్వస్థతతో దావాఖనాలో చేరానని తెలిసిందని, కానీ వారు కోలుకుంటారని భావించిను. కానీ రామోజీరావు ఇక లేరనే వార్త తనను ఆవేదన కలిగించిందన్నారు. రామోజీ అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థింస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.






