సీపీపీ ఛైర్ పర్సన్ గా సోనియా గాంధీ
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలందరితో కూడిన కాంగ్రెస్ పార్లమెంట్ పార్టీ ఛైర్ పర్సన్ గా కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ మరోసారి ఎంపికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హల్లో శనివారం జరిగిన సమావేశంలో ఎంపీలు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీపీ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ పేరును కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదించగా, ఆమెతో పాటు గౌరవ్ గొగోయ్, తారిఖ్ అన్వర్, సుదర్శన్ పేర్లను నేతలు బలపరిచారు.
ఈ సందర్భంగా సోనియా గాంధీ మీడియా మాట్లాడుతూ... కేంద్రంలో ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయానుకొని, చేయాలేకపోయిన నరేంద్ర మోదీ నాయకత్వ హక్కులను కోల్పోయారని ఆమె దుయ్యబట్టారు. ఈ వైఫల్యానికి బాధ్యత మహించాల్సింది పోయి, రేపు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రదర్శన ఏ రాష్ట్రాల్లో అయితే తక్కువగా ఉందో ఆ రాష్ట్రాల్లో మెరుగవ్వడంపై తాము దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి ఇది కొత్త అవకాశంగా భావిస్తున్నట్లు సోనియా గాంధీ పేర్కొన్నారు.






