calender_icon.png 26 August, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు బీహార్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్

26-08-2025 09:29:53 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం బీహార్ లో పర్యటించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్.. నేడు అక్కడి నుంచి నేరుగా బీహార్ బయలుదేరారు. బీహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రకు మద్దతు తెలిపేందుకు రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు బీహార్ లో పర్యటిస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు బీహార్ లో పర్యటిస్తున్నారు.