26-08-2025 10:11:07 AM
15 తులాల బంగారం, 30 తూలల వెండి చోరీ
మంథని (విజయక్రాంతి): రామగిరి మండలంలోని కలవచర్ల గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కల్వచర్ల గ్రామానికి చెందిన గదాల లక్ష్మి తన కూతురి ఇంటికి వెళ్లగా, కుమారుడు రాంబాబు కరీంనగర్ కు తన అత్త గారింటికి వెళ్లాడు. సోమవారం సాయంత్రం లక్ష్మి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దీంతో కంగారు పడి ఇంట్లోకి వెళ్లి చూడగా దాదాపు 15 తులాల బంగారంతో పాటు 30 తులాల వెండి కనిపించకపోవడంతో దొంగలు పడి ఎత్తుకుపోయినట్లు గుర్తించిన ఆమె పోలీ సులకు ఫిర్యాదు చేసింది. దీంతో మంథని సీఐ రాజు, రామగిరి ఎస్సై దివ్య ఘటనాస్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.