calender_icon.png 26 August, 2025 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి ఆర్పిఎఫ్ ఎస్సై కి పదోన్నతి

26-08-2025 10:22:16 AM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి ఆర్పిఎఫ్(Railway Protection Force) ఎస్సై ఎం. వెంకట్రావు రైల్వే విభాగంలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారు. ఈ మేరకు ఆయన సికింద్రాబాద్ రైల్వే డివిజన్ లో రిపోర్ట్ చేశారు. బాపట్లకు చెందిన ఎస్సై వెంకట్రావు 1998లో రైల్వే కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. ఐదేళ్లపాటు నిజామాబాద్ లో ఆర్ పి ఎఫ్ ఏ ఎస్ఐ గా పని చేస్తూ తెనాలి, విజయవాడ రైల్వే డివిజన్ లలో ఎస్సై గా పనిచేశారు. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ లో సికింద్రాబాద్ లో విధులు నిర్వర్తించిన ఆయన బెల్లంపల్లి రైల్వే డివిజన్ ఆర్పిఎఫ్ ఎస్సైగా నాలుగు నెలల కిందట బాధ్యతలు చేపట్టారు. అనతి కాలంలోనే రాయలసీమ రైల్వే డివిజన్ గుంతకల్లు ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారు.

బెల్లంపల్లి రైల్వే డివిజన్ లో ఎస్సై గా పనిచేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వెంకట్రావు తెలిపారు. బెల్లంపల్లి ప్రాంత ప్రజలతో తనకు మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని,తనకు తోబుట్టువుల ప్రేమను ఇక్కడి ప్రజలు మరిపించారని భావోద్వేగాన్ని పంచుకున్నారు. తాను పనిచేసిన బెల్లంపల్లి ప్రాంత ప్రజలను , సహ సిబ్బంది అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరచిపోలేనని చెప్పారు.రైల్వే ఆస్తుల పరిరక్షణ,ప్రయాణికుల భద్రత పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బంది కి సూచించారు.విధి నిర్వహణ లో తనకు జీ. ఆర్.పి సిబ్బంది ఎనలేని సేవలు అందించారని చెప్పారు. అర్పీఫ్ ,జీ ఆర్ పి సిబ్బంది ఎస్సై వెంకట్రావు ను సోమవారం రాత్రి పూలమాలలు,శాలువాలతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.