calender_icon.png 26 August, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంచలనం రేపిన 17 ఏళ్ల బాలికపై సామూహిక హత్యాచార నిందితులు అరెస్ట్

26-08-2025 10:14:33 AM

చాతకొండ గ్రామానికి చెందిన యువకులు

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీ(Bhadrachalam Agency) పరిధిలో శనివారం 17 ఏళ్ల బాలికపై జరిగిన ఘోర సామూహిక హత్యాచారంకు పాల్పడిన ఇద్దరి నిందితులను పాల్వంచ పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం చాతకొండ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వేస్ట్ ఆయిల్స్ సేకరణ వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఈ వ్యాపార నిమిత్తం తరచూ చతిస్గడ్ ప్రాంతానికి వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఛత్తీస్‌గఢ్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఓ ఆదివాసి బాలిక వారిని లిఫ్ట్ అడిగింది. అదే అదునుగా బాలికను ఆ ట్రాలీ ఆటోలో తీసుకుని వస్తూ మత్తుమందు కలిపిన శీతల పానీయాన్ని తాగించి అడవి మార్గంలో సామూహిక హత్యాచారానికి పాల్పదినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం నందితులను ఫాలో తప్పు పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు.ఒకరోజు వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేసిన పాల్వంచ పోలీసులను ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారు.