26-08-2025 08:54:10 AM
బెయిల్ పై బయటకు వచ్చిన 11మంది..
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపల్ పరిధి 11వ వార్డులో గత సంవత్సరం దసరా సందర్భంగా వార్డు అభివృద్ధిలో భాగంగా పడాలపల్లిలోని ప్రధాన దారి డివైడర్ ను ప్రభుత్వ నిధులతో నిర్మించడం జరిగింది. రోడ్డుకు ఇరువైపులా కావలసిన మట్టిని పోయమని గత మున్సిపల్ కమిషనర్ తో తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా బతుకమ్మ ఘాటును నిర్మించాలని రాతపూర్వకంగా వినతి పత్రం సమర్పించాము, రోడ్డుకు హైమస్టు లైట్లు బిగించాలని గత మున్సిపల్ కమిషనర్ ను కాలనీ వాసులు కోరడం జరిగింది. వీటన్నింటినీ పక్కన పెట్టి మీకు ఏ అధికారం ఉందని అడుగుతున్నారని కొంతమంది కాంగ్రెస్ ప్రేరేపిత నాయకులు సలహాలతో ఆనాడు మాపైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసులు వేయడం జరిగింది. అదే కోణంలో సోమవారం 11 మందినీ పోలీసులు పిలిచి నోటీసులు తీసుకొని స్టేషన్ బైయిల్ తీసుకొని వెళ్ళమని లేకపోతే అరెస్టు చేయడం జరుగుతుందన్నారు.
దీంతో పోలీసుల సలహా మేరకు 11 మందిమి పోలీస్ స్టేషన్ వచ్చి స్టేషన్ బెల్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బి ఆర్ ఎస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్లు అధికార దాహం కోసం బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లి బిఆర్ఎస్ ఉనికిని దెబ్బతీశారన్నారు, తొలి మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ పై మరియు బి ఆర్ ఎస్ మాజీ కౌన్సిలర్ల పై కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఈ అక్రమ కేసులన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న వలస కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ లారా మీకు ఇదే మా సవాల్... రానున్న స్థానిక సమరంలో మీ పార్టీ నుండి నిలబెట్టిన క్యాడర్ ను గెలిపించుకునే సత్తా మీలో ఉందా? అని సవాల్ విసిరారు.
మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ నాయకులు వెంకట గౌడ్... అంతేకాకుండా 11వ వార్డు తూప్రాన్ మున్సిపల్ లో ఒక భాగమేనని మా వార్డు అభివృద్ధిపై దృష్టి సారించకపోవడంతో వార్డులోని ప్రజలంతా ఏకమై మున్సిపల్ అధికారులను అడగడంతో వలస కాంగ్రెస్ ప్రేరేపిత నాయకుల బలముతో మాపై అక్రమ కేసులు పిరాయించడం ఎంత మట్టుకు సమంజసమని నిలదీశారు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి అధికార అహంకారాన్ని చూపించుకునే తుతూ మంత్రం కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్ మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో మీకు వారే ఓటు ద్వారా సమాధానం చెబుతారని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఇందులో బొంది హనుమంతు గౌడ్, లంబ రాజు యాదవ్, కానుకుంట సుదర్శన్, మల్లికార్జున్ యాదవ్, పిల్లుట్ల రాజు, సిహెచ్ రాజు యాదవ్, రాపోలు రాజు యాదవ్, నంది సురేష్, బత్తుల బాబు, తదితరులు ఉన్నారు.