calender_icon.png 26 August, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ డీలర్లకు కమిషన్ ఇవ్వాలని ఎమ్మార్వోకు వినతి

26-08-2025 10:16:46 AM

మునిపల్లి (విజయక్రాంతి): గత ఐదు నెలలుగా రేషన్ డీలర్లకు ప్రభుత్వం నుంచి వచ్చే కమిషన్ ఇవ్వాలని కోరుతూ మునిపల్లి ఎమ్మార్వో గంగాభవాని(MRO Ganga bhavani)కి మండలంలోని రేషన్ డీలర్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు మాట్లాడుతూ, ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు నెలలకు సంబంధించి లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం నుంచి తమకు అందే రేషన్ బియ్యానికి సంబంధించిన కమిషన్ రావడంలేదని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషన్ను వేర్వేరుగా కాకుండా పాత పద్ధతిలో రేషన్ డీలర్లకు కమిషన్ లు ఒకేసారి విడుదల చేసి డీలర్ల ఖాతాలో జమ చేసేలా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు నాగిశెట్టి, కార్యదర్శి బస్వరాజ్, ఉపాధ్యక్షుడు శ్రీశైలం, రేషన్ డీలర్లు మునీర్, సురేష్, రాంరెడ్డి, ప్రభు, దేవేందర్, వీరేశం, హన్మంత్ ,ఫైసల్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.