23 July, 2026 | 1:46 AM

71 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

23-07-2026 12:00 AM

అలంపూర్, జూలై 22: అలంపూర్ నియోజకవర్గానికి చెందిన 71 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.15.81 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను ఎమ్మెల్యే విజయుడు బుధవారం పంపిణీ చేశారు. కర్నూలులోని ఎమ్మెల్సీ చల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో తోడ్పాటునందిస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.