calender_icon.png 18 September, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదోడి ఆరోగ్య సమస్యలకు సీఎంఆర్‌ఎఫ్ భరోసా

18-09-2025 01:11:01 AM

మెదక్ లోక్‌సభ కాంటెస్టెడ్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

పటాన్చెరు, సెప్టెంబర్ 17 :పేదోడికి సీఎం సహాయనిధి(సి.ఎం.ఆర్.ఎఫ్ ) ఆరోగ్య, ఆర్థిక భరోసా కల్పిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. బుధవారం చిట్కుల్ ఎన్‌ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్దిదారులకు మొత్తం మూడు లక్షల ఇరవై ఐదు వేల విలువగల సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులను ఆయన అందచేశారు.

ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు మరియు వారి కుటుంబీకులు, ఇస్నాపూర్ మాజీ సర్పంచ్, ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, బొల్లారం మాజీ కౌన్సిలర్ సుజాతమహేందర్ రెడ్డి, దానయ్య, ముత్తంగి అశోక్, తుడుం శ్రీనివాస్, గారెల మల్లేష్, మన్నె రఘు, భిక్షపతి రెడ్డి, గోపాల్, గారెల శ్రీనివాస్, దశరథ్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.