18-09-2025 01:10:29 AM
గౌరవ వందనం స్వీకరించి జెండా ఎగరవేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు ముఖ్యఅతిథిగా పాల్గొనీ కలెక్టర్ కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలనలో అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను,ప్రసంగించారు. భగవస్ శ్రీ విరాట్ విశ్వకర్మ వీరబ్రహ్మేంద్రస్వామి యజ్ఞ మహోత్సవంలో పాల్గొని వీరబ్రహ్మేంద్రస్వామి గారికి ప్రత్యేక పూజలు చేశారు.
వలిగొండలో..
వలిగొండ, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాలను ఎగురవేశారు. సెప్టెంబర్ 17న పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం నిర్వహించింది. వలిగొండ మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమాలలో తహసిల్దార్ దశరథ, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, ఎస్‌ఐ యుగేందర్ గౌడ్, ఏవో అంజనీ దేవి, ఎంఈఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద..
ఆలేరు సెప్టెంబర్17 (విజయ క్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా ఈరోజు ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మన రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్ పర్సన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి ఇట్టి కార్యక్రమం లో పాలక వర్గ సభ్యులు , జిల్లా, రాష్ట్ర నాయకులు , మాజీ ప్రజా ప్రతినిధులు , రైతులు , అధికారులు, సిబ్బంది మొదలగువారు పాల్గొన్నారు.