24 March, 2026 | 2:47 AM

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్

24-03-2026 01:19 AM

వెల్దుర్తి, మార్చి 23: నిరుపేదలకు సిఎంఆర్ ఎఫ్ పథకం ఒక వరం లాంటిదని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. సోమవారం వెల్దుర్తి మండలానికి చెందిన పదిమంది లబ్ధిదారులకు రూపాయలు 4,65,500 రూపాయలు నేరుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిరుపేదలకు ఎల్ ఓ సి లు కావచ్చు అలాగే సీఎంఆర్‌ఎఫ్ కూడా అత్యధిక సంఖ్యలో వస్తున్నాయని అలాగే దరఖాస్తు చేసుకోగానే తొందరగా లబ్ధిదారులకు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్ రెడ్డి, నరసింహారెడ్డి, తలారి మల్లేష్, వెంకటరెడ్డి, శివలింగం, బంజరవి లు పాల్గొన్నారు.