14 April, 2026 | 5:11 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

అనారోగ్య మహిళకు సీఎంఆర్‌ఎఫ్ అందజేత

21-02-2026 12:00 AM

సనత్‌నగర్ ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి):- అనారోగ్యానికి గురైన మహిళకు మెరుగైన చికిత్స కోసం ముఖ్యమంత్రి సహా య నిధి మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. సనత్ నగర్‌లోని బికె గూడకు చెందిన బొడ్డు స్వప్న నరాల సంబంధ సమస్యతో కొద్దికాలంగా బాధపడుతున్నది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆమె భర్త శ్రీకాంత్ గౌడ్ మెరుగైన వైద్యం చేయించలేకపోయారు.

తన భార్య చికిత్స కోసం సహాయం అందించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శ్రీకాంత్ గౌడ్ ఆశ్రయించి కోరారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మంజూరైంది. శుక్రవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీకాంత్‌గౌడ్‌కు ఆర్ధిక సహా యం మంజూరు పత్రాన్ని అందజేశారు.