calender_icon.png 21 February, 2026 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్‌లో బీసీలకు ఏటా అన్యాయం

21-02-2026 12:00:00 AM

  1. 27న ’బీసీల ఆక్రందన’ దీక్షను విజయవంతం చేయాలి
  2. బీసీ సంఘాల నేతలు

ముషీరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్లో రాష్ట్ర జనాభాలో 61 శాతానికి పైగా ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. ఈ వివక్షకు నిరసనగా ఫిబ్రవరి 27న ఇందిరా పార్క్(ధర్నా చౌక్) వద్ద భారీ నిరసన దీక్ష చేపట్టను న్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో కార్యక్రమ వాల్ పోస్టర్ ను బీసీ ఇంటిలెక్చువల్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్‌గౌడ్ ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఏపీ తరహాలో తెలంగాణలో కూడా బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి రూ.50 వేల కోట్లు కేటాయించాలని అన్నారు. పెం డింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే చెల్లించాలన్నారు. 21 బీసీ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులను ఇతర పథకాలకు మళ్లించకుండా ఆయా కులవృత్తుల అభివృద్ధికి వెచ్చించాలని కోరా రు.

బీసీల రక్తమాంసాలతో తయారైన బడ్జెట్‌లో వారికే వాటా లేకపోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి బహుజన నాయకుడనని చెప్పుకుంటున్నా, చేతల్లో మాత్రం ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు.

27న దీక్షను జయప్రదం చేయాలని బీసీలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ ఛైర్మన్ దుర్గయ్య గౌడ్, రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, బైరు శేఖర్ గంపుత్ర, సింగం నాగేష్ గౌడ్, ఎర్రమాద వెంకన్న నేత, నాగభూషణం, బోయ గోపి తదితరులు పాల్గొన్నారు.