15 April, 2026 | 4:59 AM

సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరం

19-11-2025 04:04 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ  నివాసంలో  బుధవారం సుంకరి భాగ్య, సమీర్, పోతరాజుల కవితకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎం సహాయనిధి పథకం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.ఆపద సమయంలో సంజీవినీలా పని చేస్తోందని పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.