calender_icon.png 19 November, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్తారంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

19-11-2025 04:27:26 PM

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు సూచన మేరకు మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో భారతరత్న, ఉక్కు మహిళ, తొలి మహిళా, శ్రీమతి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ దేశ తొలి మహిళా ప్రధానిగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకురాలు గా, అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దేశ ప్రజలకు అనేక సేవలను అందించారని, కాంగ్రెస్ పార్టీ బలోపేతాని కోసం ఎంతగానో కృషి చేయడం జరిగిందని, బ్యాంకుల జాతీయ కరణచేసి ప్రజలకు లావాదేవీల సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు  దొడ్డ బాలాజీ, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కతట్ల వినీత్ యాదవ్, ఏఎంసీ డైరెక్టర్ బుచ్చంరావు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు వాజిద్ పాషా, కిసాన్ సెల్ అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, సీనియర్ నాయకులు తాటిపాముల శంకర్, సింగనవేన సమ్మయ్య, గుడి కొండల్ రెడ్డి, కో-కోఆర్డీనేటర్ అనుము ప్రశాంత్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.