19-11-2025 04:01:26 PM
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్ము రవి
చేర్యాల: చేర్యాల మండలంలోని నాగపూరి గ్రామంలోని ఇందిరాగాంధీ విగ్రహనికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంజే మల్లేశం పూలమాలలు వేసి నివాళ్లు అర్పించి పండ్లు, స్వీట్లు పంచి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని రూపాయి మూల్యాంకణం, రాజాభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ వంటి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారన్నారు.
భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎనలేనని సేవలు చేసి, దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు నిర్మించి, నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నల్ల పోచమ్మ ఆలయ చైర్మన్ గూడెపు మహేష్, దానంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మాదాసు మల్లేశం, కొల్పుల యాదగిరి, చిరుమల్ల శ్రీనివాస్, జీడాల సురేష్, బుచెల్లి నర్సింహులు, దేవనబోయిన కరుణాకర్ తో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.