08-02-2026 12:10:43 PM
శామీర్ పేట్,(విజయక్రాంతి): అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని చౌరస్తాలో గల దక్ష జూనియర్ కళాశాలలో ఐటీఐ, జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల కోసం నిపుణులైన అనుభవం కలిగిన అధ్యాపకులతో, విద్యార్థులు సునాయాసంగా ప్రవేశ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించే విధంగా బోధనా కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుండి మొదలుపెట్టనున్నట్టు దక్ష విద్యాసంస్థల కరస్పాండెంట్ శివ శంకర్, అకాడమిక్ డైరెక్టర్ మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో జేఈఈ, నీట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పదవ తరగతి విద్యార్థులు బోర్డ్ పరీక్షల్లో మానసిక ఒత్తిడికి లో కాకుండా మెరుగైన ఫలితాలను రాబట్టడానికి కావలసిన విషయాలను విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో చర్చించారు.