11 May, 2026 | 10:49 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

యూపీఏ హయాంలోనే బొగ్గు కుంభకోణం

22-06-2024 12:57 AM

బీజేపీ నేత సోగల కుమార్

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): బొగ్గు దందాకు పాల్పడింది కాంగ్రెస్ పార్టీయేనని, యూపీఏ హయాంలోనే బొగ్గు కుంభకోణం జరిగిందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగల కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బొగ్గు గురించి తెలియని కంపెనీలకు 121 బొగ్గు బ్లాకులను అంటగట్టిన ఘనత యూపీఏ సర్కారుదని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు తీర్పుతో వాటిని రద్దు చేశారని గుర్తు చేశారు. 2015లో ప్రధాని మోదీ కొత్త మైనింగ్ చట్టాన్ని తీసుకొచ్చారని,  ఆ చట్టానికి అనుకూలంగా బీఆర్‌ఎస్ ఎంపీలూ ఓటేశారన్నారు. అత్యంత పారదర్శకంగా ఇప్పటికే 80 వరకు బ్లాకులను తమకే కావాలని దరఖాస్తు పెట్టిన వారికి అవకాశం లభించిందన్నారు. కానీ తెలంగాణలోని 4 బ్లాకులు మాకే కావాలని ఇక్కడి బీఆర్‌ఎస్ సర్కారు దరఖాస్తు చేసుకోలేదని గత కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారని గుర్తు చేశారు.