17 July, 2026 | 4:57 PM

రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దు

22-06-2024 12:56 AM

కేంద్ర మంత్రులకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): యువతను ఆకట్టుకునేం దుకు బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  అన్నారు. హైదరాబా ద్‌లోని గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడు తూ.. హైదరాబాద్‌లో ఐటీఐర్‌కు యూపీఏ హయాం లో అనమతులు వచ్చాయన్నారు. ఆ తర్వాత కేంద్రం లో బీజేపీకి అధికారంలోకి వచ్చాక ఐటీఐర్‌ను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లిందన్నారు. ఐటీఐఆర్‌ను అమలు చేసి ఉంటే గడిచిన పదేళ్లలో దాదాపు 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు. కానీ కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ ఐటీఐఆ ర్ ఏర్పాటును పట్టించుకోలేదన్నారు. రద్దు చేసిన ఐటీఐఆర్‌ను ఇప్పుడు తెప్పించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌పైన ఉందన్నారు. ఐటీఐఆర్‌ను రద్దు చేస్తే నాడు బీఆర్‌ఎస్ నోరు మెదపలేదన్నారు. సెంట్రల్‌లోని బీజేపీ మంత్రులు కూడా పట్టించుకోలేదన్నారు.