14 August, 2026 | 2:12 AM

కొందరికే ‘బొద్దింక’ వ్యాఖ్యలు

14-08-2026 12:57 AM
  1. ఝార్ఖండ్ నిరసనలపై ఎందుకు స్పందించరు?
  2. బీజేపీ ఎంపీ కంగనారనౌత్

న్యూఢిల్లీ, ఆగస్టు 13: తాను చేసిన వ్యాఖ్య లు దేశంలోని యువత మొత్తాన్ని ఉద్దేశించినవి కావని, కొందరు వ్యక్తులను మాత్రమే ఉద్దేశించి చేశానని బీజేపీ ఎంపీ కంగనారనౌత్ స్పష్టం చేశారు. ‘మురికి కాలువల నుం చే బొద్దింకలు వస్తాయి (జెన్ జీ గట్టర్ జనరేషన్)’ అన్న వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా యు వత, రాజకీయ నాయకుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అయిన విషయం తెలిసిందే. దీంతో కంగనారనౌత్ గురువారం తన వ్యాఖ్యలపై ఢిల్లీలో స్పష్టతనిచ్చారు.

తమను తాము బొద్దింకలు అని ఎవరైతే అభివర్ణించుకుంటారో వారిని ఉద్దేశించే చేశానన్నారు. తాను అన్నమాటల్లో తప్పేముందని ప్రశ్నించారు. జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టిన వారు ఝార్ఖండ్ వద్ద విద్యార్థులపై జరుగుతున్న లాఠీచార్జీలపై ఎందుకు స్పందించరని నిలదీశారు. అప్పుడేమో మొసలి కన్నీరు కార్చారని, వేధింపులకు గురవుతున్నది జెన్ జీ కాదా? అని నిలదీశారు. జంతర్‌మంతర్ వద్ద నిరసన జరుగుతున్నప్పుడు పలువురు తన ఇంటిని చుట్టుముట్టారన్నారు.

తన సహచర ఎంపీల కార్లు, ఇళ్లను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు నసీరుద్దీన్‌షాపై కూడా విరుచుకుపడ్డారు. అంతప్రేమ ఉంటే పాక్‌కు వెళ్లాలని చురకలంటించారు. దేశ విభజన జరిగిన ఇన్నేళ్లయినా వారికి పాక్‌పై ప్రేమ ఎందుకు తగ్గడం లేదని నిలదీశారు.