28-01-2026 12:10:06 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంట్రల్ ఆఫ్ ఎక్సెలెన్సీ కళాశాలల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్న కందుల శ్రీ హర్ష అండర్ 19 ఎస్జీఎఫ్ఐ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ తెలిపారు. ఈనెల 9, 10 ,11 తేదీలలో టీ జీ ఆర్ ఎస్ బెల్లంపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జట్టు నుంచి ఉత్తమ ప్రదర్శన కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.
అండర్ 19 జాతీయ స్థాయి పోటీలు మహారాష్ట్ర లోని నాగపూర్ లో ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి రెండు వరకు జరుగుతాయని తెలియజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయ సాగర్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో రాణించలని క్రీడలతో మంచి భవిష్యత్తు క్రమశిక్షణతో మెలుగుతారని, గెలుపోవటములను సమానంగా తీసుకోవాలన్నారు. మంచిర్యాల డి ఐ ఈ ఓ అంజయ్య, డి సి ఓ రమా కళ్యాణి, వైస్ ప్రిన్సిపాల్ తన్నీరు గోపి, దశరథం, కమలాకర్, తిరుపతి, లక్ష్మణ్, హెల్త్ సూపర్వైజర్ శ్రీలత, హారిక శశి కుమార్ ఆల్ ది బెస్ట్ పలికారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు అల్లూరి వామన్ ముచ్చ కుర్తి రాజశేఖర్ పాల్గొన్నారు.