calender_icon.png 28 January, 2026 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

28-01-2026 01:25:51 PM

హెల్ప్ డెస్క్ ల తనిఖీ 

కలెక్టర్ కు పలువురు ఫిర్యాదు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నామినేషన్ దాఖలు తీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ దాఖలు  మొదటి రోజు  కావడంతో అధికారులకు పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది అభ్యర్థులకు కావలసిన ధ్రువీకరణ పత్రాలను సకాలంలో జారీ చేయాలని మునిసిపల్ అయ శాఖల అధికారులను  ఆదేశించారు.

బిల్లుల విషయంలో సంబంధించిన ధ్రువీకరణ పత్రాల జారీలో  ఆలస్యం చేయరాదని మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డిని ఆదేశించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రానికి  పలు ధృవీకరణ పత్రాల కోసం వచ్చిన అభ్యర్థుల తో కలెక్టర్ కొద్దిసేపు మాట్లాడారు. వారి అనుమానాలను కలెక్టర్ నివృత్తి చేశారు.  స్థానిక అధికారులు ధ్రువీకరణ పత్ర విషయమై సతాయిస్తున్నారని కలెక్టర్ కు కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కలెక్టర్ ధ్రువీకరణ పత్రాల జాప్యం చేయరాదని,సకాలంలో అందజేయాలని  అధికారులకు చెప్పారు. కలెక్టర్ వెంట సంబంధించిన అధికారులు ఉన్నారు.