calender_icon.png 28 January, 2026 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్ సెంటర్ తాళంతో.. ప్రజల కష్టాలు

28-01-2026 12:04:22 PM

ఆరోగ్య ఉపకేంద్రం, ఇంటి రెంటు కట్టకపోవడంతో తాళం.

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గల ఆరోగ్య ఉప కేంద్రం ఇంటి అద్దె నెలకు 2000 చొప్పున గత రెండు సంవత్సరాల నుంచి సుమారు 48 వేల రూపాయలు కట్టకపోవడంతో సబ్ సెంటర్కు యజమాని తాళం వేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సబ్ సెంటర్ ఆరోగ్య సిబ్బంది మాట్లాడుతూ కాలనీలో సబ్ సెంటర్ ప్రారంభించినప్పుడు సంబంధిత స్థానిక డాక్టర్లు రెంటు చెల్లిద్దామని చెప్పి, రెండు సంవత్సరాలు గడిచిన నేటి వరకు ఎటువంటి రెంటు ఇవ్వకపోవడంతో ,సంబంధిత యజమాని గడిచిన వారం రోజులుగా తాళం వేసినట్లు తెలిపారు. అందులో పని చేసినట్టు సిబ్బందికి 8 నెలలు గడిచిన, పూర్తిస్థాయిలో జీతభత్యాలు రాకపోవడం గమనార్వం. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు పెద్ద మనసుతో గ్రహించి, తుంగతుర్తి మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ బిల్డింగును, సబ్ సెంటర్ కి ఇచ్చే విధంగా కృషి చేయాలని వారు కోరారు. సబ్ సెంటర్ ఇంటి అద్దె డబ్బులను జిల్లా డిఎంహెచ్వో, జిల్లా కలెక్టర్ పరిశీలన చేయాలని, ప్రజలు కోరుతున్నారు.