28-01-2026 01:06:43 PM
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం 2026-27 బడ్జెట్ సమావేశాల మొదటి రోజున పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. బిర్సాముండా, సర్దార్ పటేల్ కు రాష్ట్రపతి నివాళులర్పించారు. భారతరత్న భూపేన్ హజారికా శతజయంతి సందర్భంగా నివాళలర్పించారు. స్వేఛ్చ, సామాజిక న్యాయం అందరికీ అందాలని అంబేద్కర్ ఆకాంక్షించారని తెలిపారు. పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించామని రాష్ట్రపతి స్పష్టం చేశారు. 100 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు అందించామని వెల్లడించారు. నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమ చేశామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లమందికి వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సికిల్ సెల్ వంటి వ్యాధులపై పోరాటం సాగిస్తున్నామని రాష్ట్రపతి స్పష్టం చేశారు. కరోనా తర్వాత బీమాపై ప్రజల్లో అవగాహన పెరిగిందని వెల్లడించారు. వికసిత్ భారత్ లో రైతులు, మహిళలు, యువతది కీలకపాత్ర అన్నారు.
వరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర పతి సూచించారు. తయారీ రంగంలోనూ మంచి ప్రగతి నమోదువుతోందని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లోనూ భారత్ దూసుకెళ్తోందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. సామాజిక న్యాయసాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పేదల కోసం 4 కోట్ల ఇళ్లు నిర్మించామని ద్రౌపదీముర్ము వెల్లడించారు. వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల ద్వారా సేవలు విస్తరించామని చెప్పారు. దేశంలో 150కిపైగా వందేభారత్ రైళ్లు ఉన్నాయన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా కోట్లమందికి తాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. దేశంలో స్పేస్ టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడంపై దేశప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పన్ను సంస్కరణలు రూపొందుతున్నాయని పేర్కొన్నారు.
దేశం పవర్ టెక్నాలజీ హబ్ గా రూపొందుతోందని రాష్ట్రపతి తెలిపారు. దేశ అణువిద్యుత్ సామర్థ్యం క్రమంగా పెరుగుతోందన్నారు. అవినీతి కట్టడి ద్వారా ప్రభుత్వం ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తోందని, 95 కోట్ల మందికిపైగా సామాజిక భద్రత కల్పించామని చెప్పారు. భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోబోందన్నారు. ఈశాన్య భారతంలో వైద్యరంగంలో మౌలిక సదుపాయాలు పెంచామని పేర్కొన్నారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని దేశం సంస్కరణల పథంలో దూసుకెళ్తోందన్నారు. వికసిత్ భారత్ లో రైతులకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చామన్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామన్నారు. రైతుకు దన్నుగా నిలిపేందుకు ఆహార శుద్ధి రంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు.
గ్రామీణ ఉపాధి కల్పన కోసం జీ రామ్ జీ చట్టం తీసుకొచ్చామని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో మహిళలకు కీలక పాత్ర కల్పించామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ లో మన సైన్యం సత్తా చాటిందన్న రాష్ట్రపతి భారత్ పై దాడిచేస్తే ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం చూసిందని వ్యాఖ్యానించారు. వెనెకబడిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అన్నారు. రక్షణరంగం ఉత్పత్తుల ఎగుమతి రికార్డుస్థాయిలో పెరిగిందన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ డిఫెన్స్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగిందని సూచించారు. నానో చిప్ ల తయారీపైనా భారత్ దృష్టి సారించిందన్నారు. మైక్రో చిప్ ల తయారీలో స్వయంసమృద్ధి సాధించాలని సూచించారు.
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో 15 లక్షల ఉద్యోగాలు సృష్టించగలిగామన్నారు. ముద్రయోజన ద్వారా చిరు వ్యాపారులకు భారీగా రుణాలు ఇచ్చామని తెలిపారు. పీఎం విశ్వకర్మ యోజ ద్వారా 20 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని స్పష్టం చేశారు. స్టార్ట్ ప్ ఎకో సిస్టమ్ లో భారత్ మూడోస్థానంలో నిలిచిందన్నారు. కొత్తగా 25 లక్షల సంస్థలు స్టార్టప్ లుగా నమోదయయ్యాయని పేర్కొన్నారు. ఐటీ, జీపీసీ రంగంలో కొత్త ఉద్యోగాలు భారీగా పెరిగాయన్నారు. ఐటీ, ఐటీఈఎస్ రంగాలు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా జాతీయ విద్యా విధానం తీసుకువచ్చామన్నారు. దేశంలో లక్షన్నర అటల్ టింక్లరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశామన్నారు. 2030లో కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు భారత్ ఒక వారథిగా ఉందని వెల్లడించారు. అంతర్జాతీయ సంక్షోభాల నివారణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. 1500 ఏళ్ల తర్వాత సోమ్ నాథ్ ఆలయాన్ని పునర్ నిర్మించుకున్నామన్నారు. ప్రాచీన చరిత్ర, ఆధారాలను డిజిటలీకరణ చేస్తున్నామని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.