28-01-2026 12:11:58 PM
నల్లమల్లలు దారుణ సంఘటన
అచ్చంపేట జనవరి 28: ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదన్న కారణంతో ఓ ఆదివాసి ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నల్లమలలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా బొమ్మనపల్లికి చెందిన చెంచు కుటుంబానికి చెందిన దాసరి ప్రసాద్, పదర మండలం చిట్లంకుంటకు చెందిన సువర్ణ కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇద్దరి కుటుంబాలలోను తెలిసింది.
కాగా వీరు పెళ్లికి సువర్ణతలకు బంధువులు నిరాకరించారని తెలుస్తోంది. దీంతో మంగళవారం రాత్రి బొమ్మనపల్లి లోని ప్రసాద్ ఇంట్లో ప్రేమికుల ఇద్దరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా సువర్ణ రెండు రోజుల క్రితమే తల్లిదండ్రులను వదిలేసి ప్రసాదింటికి చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. కృతదేహాలను శవపరిక్ష నిమిత్తం అచ్చంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక గాను ఒక కొడుకు అర్ధాంతరంగా తను చాలించడంతో ప్రసాద్ తల్లిదండ్రుల రోదనలు అందర్నీ కలచివేస్తున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సిద్ధాపూర్ పోలీసులు తెలిపారు.