28-01-2026 12:02:36 PM
ఘట్ కేసర్, జనవరి 28 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్ ఎదులాబాద్ లోని రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో ఈనెల 28 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు అంబారిపేట అప్పలాచార్యులు, మురళీకృష్ణ, వరదరాజులు తెలిపారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు తొలక్కం, దివ్య ప్రబంధ పారాయణం, ద్రావిడ వేదపారాయణం, 29న ఉదయం సేవాకాలము, ప్రబోధకి ఆరగింపు, సాయంత్రం 5 గంటలకు దివ్య ప్రబంధ పారాయణము, 30న సాయంత్రం 6 గంటలకు వైకుంఠోత్సవము, 31న ఉదయం 10 గంటలకు స్వామి వారి గ్రామ సేవ, 11 గంటలకు శ్రీస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవము, ఫిబ్రవరి 1న సాయంత్రం 6 గంటలకు శ్రీస్వామి వారి విమాన రథోత్సవము, 2న ఉదయం చక్రతీర్థ స్నానము, అరగింపు, తీర్థ ప్రసాదగోష్టి తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బ్రహ్మోత్సవాలతో పాల్గొనా లని ధర్మకర్తలు కోరారు.