ఇప్పపువ్వు సేకరించి లబ్ధి పొందాలి
గిరిజన సహకార సొసైటీ చైర్మన్ కో కోటనర్ తిరుపతి
కామారెడ్డి, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ప్రస్తుత సీజన్లో ఇప్పపువ్వు అందుబాటులో ఉందని వాటిని సేకరించి ఆర్థికంగా లబ్ధి పొందాలని రాష్ట్ర గిరిజన సహకార సొసైటీ చైర్మన్ కోటనర్ తిరుపతి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, మాచారెడ్డి, లింగంపేట్, గాంధారి, మండలాల్లో పర్యటించారు. అడవిలో ప్రస్తుతం ఇప్ప పువ్వు అందుబాటులో ఉందని వాటిని సేకరించి గిరిజన సహకార సంస్థ లో అమ్ముకొని ఆర్థికంగా లబ్ధి పొందాలన్నారు.
గిరిజన మహిళలు పురుషులు ఇప్ప పువ్వు సేకరణలో పాల్గొంటున్నట్లు తెలిపారు. కామారెడ్డి గిరిజన సహకార సొసైటీ మేనేజర్ శ్రీనివాస్ తో పాటు సిబ్బంది చైర్మన్ తో కలిసి సందర్శించారు. కామారెడ్డి గిరిజన సహకార సొసైటీ పరిధిలోని లింగంపేట మండలం జల్దిపల్లి, గాంధారి మండలంలోని భవానిపేట్, మాచారెడ్డి మండలంలోని ఘన్పూర్ గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతాలను సందర్శించారు. సీజనల్గా ఆడవులలో లభించే పనులను పదార్థాలను సేకరించి ఆర్థికంగా లబ్ధి పొందాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
గిరిజనులు ప్రస్తుతం ఇప్పపువ్వు సేకరణలో ఉన్న వారి వద్దకు వెళ్లి సాధక బాధాకాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పపువ్వు సేకరించి గిరిజన సహకార సొసైటీలో అమ్మితే డబ్బులు అకౌంట్ లోనే జమ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సహకార సొసైటీ మేనేజర్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ వేణు, సిబ్బంది పాల్గొన్నారు.




