ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలెక్టర్, హౌసింగ్ ఎండీ సమీక్ష
చివ్వెంల, ఫిబ్రవరి 24: మండలంలోని గుంపుల గ్రామపంచాయతీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో హౌసింగ్ ఎండీ శ్రీ గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రత్యక్షంగా మాట్లాడి నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇండ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు, ప్రభుత్వ సహాయం అందుతున్న విధానం, పనుల వేగం వంటి అంశాలపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం పేద ప్రజలకు శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని అధికారులు తెలిపారు. లబ్ధిదారులు నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. అవసరమైన సాంకేతిక మార్గదర్శకాలు అందుబాటులో ఉంటాయని హౌసింగ్ అధికారులు తెలిపారు. లబ్ధిదారులు వ్యక్తం చేసిన సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, హౌసింగ్ శాఖ సిబ్బంది,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




