మారేడుపల్లిలో ఈశ్వరి బాయి వర్ధంతి
తల్లికి నివాళులర్పించిన మాజీమంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి, డాక్టర్ రామచంద్రారెడ్డి
సికింద్రాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ప్రజా సేవకురాలిగా ఈశ్వరి బాయి ప్రజలకు అందించిన సేవలు శిరస్థాయిగా నిలిచిపోతాయని మాజీ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి అన్నారు.వెస్ట్ మారేడుపల్లి లో ఈశ్వరి బాయి మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యం లో మంగళవారం దివంగత మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి బాయి 35 వవర్ధంతి నిపురస్కరించు కొని, సికింద్రాబాద్ మారేడుపల్లి సెయింట్ జాన్స్ చౌరస్తాలో గల ఈశ్వర్య బాయి విగ్రహానికి పలువురు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్య క్రమంలో డాక్టర్ రామచంద్రారెడ్డి, మేఘనా రెడ్డి, దేవదత్, ప్రముఖులు చెన్నయ్య, దయానంద్ రావు, మహేష్ బాబు, ఉమేష్ బాబు, దుర్గాప్రసాద్, పి.నరసింహ, మనోహర్ సింగ్, కార్తీక్, ధర్మేంద్ర కుమార్, సాయికుమార్, ఈశ్వరి బాయి మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.




