ఇఫ్తార్ విందులో కలెక్టర్, ప్రజాప్రతినిధులు
13-03-2026 12:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్/నిర్మల్, మార్చి12 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్‌లో గురువారం రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లింలకు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఇఫ్తార్ విందు ను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి కలెక్టర్ కె.హరిత, ఎమ్మెల్సీ దండే విఠల్,ఎమ్మెల్యే కోవలక్ష్మి హాజరయ్యా రు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మంగా,ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్, డిడి రమాదేవి పాల్గొన్నారు. అలాగే నిర్మల్ పట్టణంలోని గాజులపేటలో కౌన్సిలర్ ఇమ్రానుల ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ పాల్గొన్నారు.




