10 July, 2026 | 2:28 AM

గంజాయి తాగుతున్న ముగ్గురు వ్యక్తుల అరెస్టు

10-07-2026 01:29 AM

మహబూబాబాద్, జులై 9 (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణ పరిధి గాయత్రి గుట్ట ప్రాంతంలో గంజాయి తాగుతుండగా, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు టౌన్ సీ ఐ రఘుపతి రెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుండి 64 వేల విలువచేసే మొత్తం 1 కేజీ ఎండు గంజాయిని, ఒక బజాజ్ మోటార్ సైకిల్ తో పాటు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటనలో మరో ఇద్దరు పారిపోయారని, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్బంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, యువత మత్తుకు బానిసై జీవితాలు పాడు చేసుకోవద్దని, ప్రజలు ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని సూచించారు.