పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలి
22-05-2024 02:54 AM
జయశంకర్ భూపాలపల్లి,మే 21(విజయక్రాంతి): ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవే ష్ మిశ్రా అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నోడల్, ఇతర అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విధుల నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎన్నికలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, నోడల్ అధికారులు అవి నాశ్, శామ్యూల్, ఆర్డీవో మంగీలాల్, డీఎస్పీ సంపత్‌రావు పాల్గొన్నారు.






