మోదీ వైపు దేశం చూపు
బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్
ఎమ్మెల్సీగా ప్రేమేందర్‌రెడ్డిని ఆశీర్వదించండి
వరంగల్ తూర్పు, మే 21: అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రాధాన్యత, విలువ పెంచుతున్న మోదీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఈటల పాల్గొన్నారు. నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల స్థానం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి ప్రేమేందర్‌రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడు తూ..‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదంతో దేశ ప్రజలను ఏకం చేసే విధంగా మోదీ పాలన సాగిస్తున్నారని చెప్పారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిన పార్టీల వెన్నులో వణుకు పుటిస్తున్నారని, ట్రిపుల్ తలాక్ చట్టం ద్వారా ముస్లిం మహిళలకు భద్రత పెరిగిందని అన్నారు. నిరు ద్యోగులను మోసం చేసిన బీఆర్‌ఎస్‌కి తగిన బుద్ది చెప్పడానికి పట్టభద్రులు సిద్దంగా ఉన్నారని తెలిపారు. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, విద్యావిధానాన్ని సక్రమంగా కొనసాగించాలనే ఆలోచన ఉంటే.. వెంటనే ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్ర మాల్లో బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూ రి రమేశ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, పలువురు పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.






