22 August, 2026 | 2:12 PM

దానికి బాధ్యులు ఎవరు..? కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

22-05-2024 01:01 PM

హైదరాబాద్: డొడ్డు వడ్లను కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దొడ్డు వడ్లను కొనేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో 80 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని చెప్పిన ఆయన చాలా తప్పుక మంది రైతులు మాత్రమే సన్న వడ్లను పండిస్తారని సూచించారు. రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తున్నారు. ఇప్పుడేయో ఆగస్టు 15లోగా చేస్తామని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.

సన్నవడ్లకే బోనస్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. రబీ కింద 75 లక్షల ధాన్యం సేకరించాలని ఒప్పదం కుదుర్చుకుందన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయన్నారు. ధాన్యం తడిచి మొలకెత్తుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్న పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే ధాన్యం కొనేందుకు మరో 2 నెలలు పడుతోందన్నారు. వర్షాలు పడి ధాన్యం మొలకలు వస్తుంటే బాధ్యులు ఎవరు? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.