17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

గేటెడ్ కమ్యూనిటీ విల్లాలలో హాస్టళ్ల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి

22-11-2025 12:00 AM

కలెక్టర్‌కు కాలనీ వాసుల ఫిర్యాదు

 మేడ్చల్, నవంబర్ 21 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని మోదీ సన్ షైన్ పార్కు ఫేస్ 1 గెటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ ఏరియాలోని 10నుంచి 15 విల్లాస్  ల్లో గర్ల్స్ హాస్టళ్లు నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ మను చౌదరి కి కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం మేడ్చల్ కలెక్టరేట్లోని ఇన్వార్డ్ లో రాత పూర్వకంగా దరఖాస్తు అందచేశారు. అలాగే, జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, ఘటకేసర్ మున్సిపల్ కమిషనర్, పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు కాలనీ వాసులు పేర్కొన్నారు. 

గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ల్లో మున్సిపాలిటీ నుంచి  రెసిడెన్షియల్ అనుమతి మాత్రమే ఉందనీ తెలిపారు. వాణిజ్య కార్యకలాపాలకు ఏలాంటి సీఎల్యూ, ట్రేడ్ లైసెన్స్, పోలీస్ ఎన్‌ఓసీ, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్, హెల్త్ సర్టిఫికేట్ లేకుండా బాలికల కాలేజీ హాస్టళ్లు నిర్వహిస్తున్నారన్నారు .రాత్రి సమ యంలో అనవసర రాకపోకలు పెరుగటంతో పాటు  అర్ధ రాత్రి బర్త్ డే లు, ఇతర సెలబ్రేషన్లు నిర్వహించటం వల్ల కాలనీ వాసులము త్రీవ ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. పైగా విద్యార్థుల మ్యూజిక్ శబ్దాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.

దీంతో భద్రత సమస్యలు కూడా తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు వస్తున్నారనీ, మహిళలు, పిల్లలు భయపడుతున్నారన్నారు.వాహన పార్కింగ్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. కాలనీలో శాంతి, స్వచ్ఛతపై భంగం కలుగుతుందన్నారు. హాస్టళ్లు నిర్వహణ అనుమతు లను  రద్దు చేయాలని కోరారు. సత్వరమే ఆ విల్లాస్ లను పరిశీలించి.. అక్రమ హాస్టళ్ల వాడకాన్ని నిలిపివేయాలని కోరారు. లైసెన్స్, సీఎల్ యూ లేకపోవడం, భద్రతా అనుమతులు లేకపోవడం వంటి అక్రమ వాడకం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే ఈ  విల్లాస్ లలో నిర్వహిస్తున్న  గర్ల్స్ హాస్టళ్లను మూసివేయాలని కోరారు. భవిష్యత్తులో ఈలాంటి  కార్యకలాపాలను నివారించాలని మనవి చేసారు.