calender_icon.png 4 May, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలుగు, పార పట్టి ఇంకుడు గుంత తవ్విన కలెక్టర్

03-05-2025 08:24:44 PM

తట్ట ఎత్తిన అదనపు కలెక్టర్....

ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టేందుకే ఇంకుడు గుంతలు : జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

బూర్గంపాడు (విజయక్రాంతి): ప్రతి వర్షపు నీటిని వడిసిపట్టేందుకే ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టాలని కలెక్టర్ జితేష్ పాటిల్(District Collector Jitesh V. Patil) అన్నారు. శనివారం ఆయన బూర్గంపాడు మండలంలో  విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. అనంతరం పాఠశాల ఆవరణలో కలెక్టర్ పలుగు పారా పట్టి ఇంకుడు గుంత తవ్వారు. జల్ సంచెయ్ జెన్ భాగీ దారి లో ప్రతి ప్రభుత్వ కార్యాలయం, వసతి గృహాలు, ఆసుపత్రులు, పాఠశాలల ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని చెప్పడమే ఆచరణలో పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 

స్వయంగా పలగు పారా పట్టి కలెక్టర్ ఇంకుడు గుంతని తవ్వడం ప్రారంభించారు. కలెక్టర్ వెంట ఉన్న స్థానిక సంస్థలు కలెక్టర్ విద్యా చందన, స్థానిక తహశీల్దార్ ముజాహిద్ తట్టలతో మట్టి ఎత్తిపోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఇంకుడు గుంతల నిర్మాణానికి వేసవినే మంచి తరుణం అని, ఈ కాలంలో తవ్వకుంటే.. వర్షాకాలం నాటికి నీటిని భూమిలోకి ఇంకుతాయని భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ పట్టణాలు,గ్రామాల్లో ఇంట్లో ఇంకుడుగుంత తవ్వుకుంటే మంచిదన్నారు. ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టాలంటే ఇంకుడు గుంత తప్పని సరిగా నిర్మించాలన్నారు. ఇంకుడు గుంత యొక్క కొలతలు ఒకటి మీటర్ వెడల్పు ఒక మీటర్ పొడవు, ఒక మీటర్ లోతు తో ఒక గుంటను తీసి అందులో అందుబాటులో దొరికే శిధిలాల వ్యర్ధాలు, చిన్న చిన్న రాళ్ళను నింపితే సరిపోతుందన్నారు.

పాఠశాల ప్రాంగణం అంత పరిశీలించి పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, పాఠశాల భవనం ఎక్కడైనా లీకేజీ ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో ఒక డార్మెటరీ హాలు,రెండు తరగతి గదులు నిర్మాణానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సిపిఓ సంజీవరావు ను ఆదేశించారు. ఇంకా ఏమైనా పాఠశాలల్లో చేయవలసిన మరమత్తులు, పరిష్కరించాల్సిన సమస్యలను నివేదిక అందించాలని పాఠశాల తరఫున ప్రారంభం నాటికి అన్ని సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించినందుకు గాను ప్రిన్సిపల్ గీత జ్యోతి నీ కలెక్టర్ అభినందించారు.

బూర్గంపాడు మండల పర్యటనలో భాగంగా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజ్, మొరంపల్లి బంజర లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలోని హై స్కూల్,అంగన్వాడీ సెంటర్లలలో కలెక్టర్  స్వయంగా పలుగు, పారా పట్టి ఇంకుడు గుంతను తవ్వి అందరిని ప్రోత్సాహించారు.అనంతరం నాగినేనిప్రోలు పంచాయతీలోని నర్సరీని,లక్ష్మీపురంలోని ఉపాధి హామీ ద్వారా మునగ సాగును పరిశీలించి చాలా బాగుందని మెచ్చుకున్నారు. సారపాకలోని పాఠశాల పిల్లల ఏకరూప దుస్తుల తయారీ కేంద్రాన్ని పరిశీలించి మే నెల చివరి నాటికి ఏకరూప దుస్తుల తయారీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తహశీల్దార్ ముజాహిద్, ఎంపీడీవో జమలారెడ్డి, ఎంఈఓ యదు సింహరాజు, ఎంపీఓ బాలయ్య, ఏపీవో విజయలక్ష్మి, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.