04-05-2025 10:02:52 AM
ఒంగోలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా(Prakasam district ) ఒంగోలు మండలంలోని కొప్పోలు సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు వద్ద జాతీయ రహదారి 16పై ఒకే చోట మూడు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. కోడిగుడ్ల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తాపడి ముగ్గురు మృతి చెందారు. బోల్తాపడిన లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. లారీ బోల్తాపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ లో ఆగి ఉన్న కారును మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ ఢీకొని కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, కారు నుజ్జు నుజ్జు అయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.