calender_icon.png 4 May, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం

04-05-2025 11:22:48 AM

ఓదాల లో విద్యుత్ షాక్ తో రెండు గేదలు మృతి 

మంథని, (విజయక్రాంతి): విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. మండలంలోని ఓదాల గ్రామ శివారులో విద్యుత్ షాక్ తో రెండు గేదలు ఆదివారం ఉదయం మృతి చెందాయని  గ్రామస్తుల వాపోయారు. గ్రామస్తుల కథనం ప్రకారం  రెండు రోజులుగా వీస్తున్న ఈదురు గాలులతో పాటు వడగళ్ల వర్షానికి గ్రామ శివారులో విద్యుత్ వైర్లు తెగుబడి ఉన్నాయని, గ్రామానికి చెందిన లెంకల చంద్రయ్య, సుంకరి రమేష్ చెందిన  రెండు గేదెలు తెగిపడ్డ విద్యుత్ తీగల కు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ తీగలు గత మూడు రోజులుగా తెగి పడిపోయాయని,  ప్రమాదం పొంచి ఉందని విద్యుత్ శాఖ అధికారులకు చెప్పినప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గేదెలు మృతి చెందాయని రైతులు వాపోయారు. గేదెల మృతితో ఒక్కో రైతు దాదాపు రూ. 40 వేల వరకు ఆర్థికంగా నష్టపోయారని రైతులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు మృతి చెందిన గేదెలకు సంబంధించిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మోతుకు రాజబాబు తో పాటు గ్రామస్తులు కోరుతున్నారు.