3 April, 2026 | 3:11 AM

దుద్దెడ గ్రామ సభలో పాల్గొన్న కలెక్టర్ హైమావతి

03-04-2026 12:03 AM

కొండపాక, ఏప్రిల్ 2: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా దుద్దెడ గ్రామసభ లో ముఖ్య అతిథులుగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి గురువారం మాట్లాడుతూ ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పంపించిన సందేశాన్ని గ్రామసభలో గ్రామస్తులకు చదివి వినిపించారు.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను వివరించి, దుద్దెడ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారుల వారిగా వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి తదితర పథకాల లబ్ధిదారులు వారి అనుభవాలను సభలో వివరించారు. గ్రామ సభలో థర్డ్ వైర్, నేరెళ్ళకుంట మట్టి పూడిక, జయశంకర్ నగర్ నుంచి బతుకమ్మ చెరువు వరకు సిసి రోడ్డు నిర్మాణం, అర్హత ఉన్న పేదవారికి ప్రభుత్వ పథకాలు అందేలా ఈ సభలో తీర్మానం చేశారు.

ముఖ్యంగా గ్రామంలో కోతుల బెడదను నివారించాలని అన్నారు. అదేవిధంగా ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించాలంటే సేంద్రీయ వ్యవసాయానికి రైతులు ముందుకు రావాలని, పంట మార్పిడి విధానం పాటించాలని అన్నారు. కొండపాక మండలంలో అన్ని వసతులతో కూడిన రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు అయిందని దాన్ని త్వరలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుద్దెడ గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్,ఉప సర్పంచ్ పల్లె జానకి యాదగిరి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి చక్రపాణి, పాలకవర్గం సభ్యులు ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.