ప్రజా పాలన ప్రగతిలో భాగస్వాములు కావాలి: ఎంపీడీవో సునీత
నూతనకల్, ఏప్రిల్ 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన ’ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీడీవో సునీత పిలుపునిచ్చారు. గు రువారం మండల పరిధిలోని మిర్యాల గ్రామం లో సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సునీత మాట్లాడుతూ, గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రణాళికల ప్రాముఖ్యతను వివరించారు.
వివిధ శాఖలకు కేటా యించిన నిధులు, ఇప్పటికే పూర్తి చేసిన అభివృద్ధి పనుల వివరాలను ఆమె గ్రామ సభలో ప్రజలకు వెల్లడించారు. భవిష్యత్తులో చేపట్టబోయే పనుల్లో పారదర్శకత పాటిస్తూ, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల స్వరూప అవిలయ్య, నాయకులు దరిపెల్లి వీరన్న, గుణగంటి వెంకన్న, వార్డు సభ్యులు పళ్ళ వెంకన్న, కొమ్ము పరమేష్, వేల్పుల కిరణ్, ఇరుగు కిరణ్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




