28 June, 2026 | 3:45 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

ఉపాధి హామీ పనులపై కలెక్టర్ తనిఖీ

04-02-2026 05:12 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలంలోని సోనాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గణేశ్‌పూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపడుతున్న పనులను కొమురం భీం జిల్లా కలెక్టర్ హరిత బుధవారం ఐఎఫ్ఎస్ అధికారి భార్గవ్ కుమార్ తో కలిసి సందర్శించి పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న పనుల పురోగతి, నాణ్యత, హాజరు నమోదు విధానంపై అధికా రులను ఆమె అడిగి తెలుసు కున్నారు. కూలీలకు వేతనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, సూచించారు. పనుల్లో పారదర్శకత పాటించాలని, నాణ్యతలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట (డి ఆర్ డి ఓ) దత్తారావు, ఎంపీడీవో పాటిల్ జ్యోత్స్న, సోనాపూర్ గ్రామ సర్పంచ్ పంద్రం సురేష్, ఉపాధి హామీ ఏపీఓ శ్రావణ్‌కుమార్, ఈసీ మోసిన్, టీఏ ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి విద్యశ్రీ సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.