20-05-2025 12:00:00 AM
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్, మే 19 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, చిన్న గూడూరు మండలాల్లోని విస్సంపల్లి, ఉగ్గంపల్లి, కంబాలపల్లి, శనిగపురం, కంబాలపల్లి, చిన్న గూడూరు గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్వహిస్తున్న రిజిష్టర్ లను పరిశీలించారు. ఇంతవరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, రైస్ మిల్లులకు తరలించిన వివరాలు, మద్దతు ధర చెల్లించిన వివరాలు మొదలగు అంశాలను అడిగి తెలుసుకున్నారు.
కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని, కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలుకు సరిపడా గోనె సంచులు, ఎగుమతికి లారీల ఏర్పాటుపై రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులు ధాన్యాన్ని మిల్లులకు సకాలంలో తరలించి రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటారని తెలిపారు.
గత పది రోజులుగా ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడం కోసం ఆయా వర్గాలను సమన్వయ పరుస్తూ నిరంతరం పనిచేస్తూ నిరంతరం పనిచేస్తున్నానని చెప్పారు.