calender_icon.png 20 May, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్లు లేని నిరుపేదలకు స్థలాలివ్వండి

20-05-2025 12:00:00 AM

  1. దళిత యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గ్యార నర్సింహ

ప్రజావాణిలో వినతి పత్రం అందజేసిన గౌరెల్లి గ్రామస్థులు

అబ్దుల్లాపూర్‌మెట్, మే 19: ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని దళిత యూత్ అసోసియేషన్ అధ్యక్షులు గ్యార నరసింహా అన్నారు. గౌరెల్లి గ్రామానికి చెందిన ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రం అందజేస్తారు. ఈ సందర్భంగా గ్యార నర్సింహా మాట్లాడుతూ..

ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, గౌరెలి గ్రామ సర్వే నెంబర్ 283లో సుమారు 84 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 26.27 ఎకరాల భూమిని పేదలకు అసైన్డ్ పట్టాలివ్వడంతో వారు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఇందులో 57.13 ఎకరాల భూమి మిగిలి ఉంది. ఈ భూమి వ్యవసాయానికి పనికి రాదని.. ఇందులో రాళ్లు, రప్పలు, ఉంటాయని తెలిపారు.

గత ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి  నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికీ 60 చదరపు గజాల స్థలాన్ని 91 మందికి కేటాయించి... పట్టా సర్టిఫికేట్లు మంజూరు చేశారు. అదే విధంగా  ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన బడ్జెట్‌ను లోన్ల ద్వారా ఇప్పించగరని గుర్తుచేశారు. ఇదే సర్వే నెంబర్‌లో వీరికి  గతంలో 1909 మంది ఇందిరమ్మ పట్టా సర్టిపికేట్లు ఇచ్చారని కానీ పొజిషన్ కేటాయించాలేదన్నారు. 

అప్పటి నుంచి నేటి వరకు 50 ఏండ్ల కావొస్తున్నా.. వారికీ ఇండ్లు లేకపోడంతో పూరి గుడిసెలు వేసుకుని నివాసంటున్న పేదలకు 120 గజాల చొప్పున స్థలం కేటాయించి వారిని ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు. రెక్కఅడితేగానీ.. డొక్క నిండని దుస్థితి వీరిదన్నారు. స్థలం కేటాయించి తగు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఓర్సు చెన్నమ్మ, ఎస్.యాదమ్మ, జూపల్లి సుజాత, గ్యార మాధవి, అవుల అరుణ, ఓర్సు భాను, సంపంగి చిట్టి తదితరులు పాల్గొన్నారు.