25 March, 2026 | 3:12 AM

ఆర్డీవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

25-03-2026 01:35 AM

మంచిర్యాల టౌన్, మార్చి 24 : మంచిర్యాలలోని ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా చేపట్టిన భూసేకరణకు సంబంధించి దరఖాస్తుల పరిష్కార పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

అభివృద్ధిలో భాగంగా భారత జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన 63, 163జి రహదారుల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని ప్రాంతాలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కార చర్యలను వేగవంతం చేయాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు, ఆర్డీవో కార్యాలయ అధికారులు తదితరులున్నారు.

ప్రచార వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్

నస్పూర్: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం ప్రచార వాహనాన్ని మంగళ వారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కలెక్టరేట్ ఆవరణలో రెడ్ కో ఆదిలాబాద్ డీఎం ఎల్.శ్రీనివాస్, టీజీ ఎన్పిడిసిఎల్ ఎస్‌ఈ రాజన్నలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం పథకం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డీఈ మల్లేశం, ఎడిఈ (కమర్షియల్) జి. మోహన్ రెడ్డి, మంచిర్యాల రూరల్ ఎడిఈ రాజశేఖర్, కలెక్టరేట్ ఏఓ పిన్న రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.