7 July, 2026 | 2:29 AM

యెంకేపల్లిలో ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

07-07-2026 01:47 AM

పాఠశాలల్లో మౌలిక వసతులపై అధికారులకు ఆదేశాలు

మొయినాబాద్, జూలై 6 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్‌ఓ) యెంకేపల్లి వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఫారాల పంపిణీ, ఫారాల నింపడం, వాటిని డిజిటలైజ్ చేసే ప్రక్రియపై బీఎల్వోలను అ డిగి తెలుసుకుని తనిఖీ నిర్వహించారు.

అనంతరం యెంకేపల్లి హైస్కూల్ను సందర్శించిన జిల్లా కలెక్టర్కు 11వ వార్డు కౌన్సిలర్ మహేష్ పాఠశాలలో కొత్త మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని, అలాగే ప్రాథమిక పాఠశాలలో శిథిలావస్థకు చేరిన గదిని కూల్చివేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు అవసరమైన చర్యలు తీసుకో వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, బీఎల్వోలు పాల్గొన్నారు.