15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వీ. పాటిల్

07-02-2026 12:00 AM

చర్ల, ఫిబ్రవరి 6, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల కేసులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ఓపీ విభాగం, రిజిస్ట్రేషన్ కౌంటర్, ల్యాబ్, ఇన్పేషెంట్ వార్డు, వ్యాక్సినేషన్ రూమ్, మందుల గది, డయాలసిస్ కేంద్రం తదితర అన్ని విభాగాలను జిల్లా కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు.

డయాలసిస్ కేంద్రంలో ప్రస్తుతం 23 మంది రోగులు చికిత్స పొందుతున్నట్లు సిబ్బంది జిల్లా కలెక్టర్కు వివరించారు. రోగులకు అవసరమైన వైద్య సదుపాయాలు, సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అటెండెన్స్ రిజిస్టర్లు, ఓపీ రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి, నిర్వహణ తీరుపై సమీక్ష నిర్వహించారు.

విధుల్లో ఉన్న మెడికల్ ఆఫీసర్తో పాటు ఇతర సిబ్బంది హాజరును కూడా పరిశీలించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి, వారికి అవసరమైన మందులు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. అలాగే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

ఆరోగ్య కేంద్రంలో మందుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందుల కోసం ఒక నెల ముందుగానే మెడిసిన్ ఇండెంట్ సమర్పించాలని మెడికల్ ఆఫీసర్ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  ఈ పరిశీలన కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ సాయి వర్ధన్, వైద్యులు కాంత్, రవికుమార్, నర్సులు, ఫార్మసిస్ట్తో పాటు విధుల్లో ఉన్న ఇతర సిబ్బంది పాల్గొన్నారు.